జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్ ఒక్క‌సారిగా ఢామ్మంటూ పేలింది..!

కొన్ని సెల్‌ఫోన్లు ఎప్పుడు పేలుతాయో.. ఎందుకు పేలుతాయో కూడా తెలియ‌దు. ష‌ర్టు జేబులో పెట్టుకున్న ఓ సెల్‌ఫోన్ ఉన్న‌ట్టుండి పేలిపోయింది. దాని దెబ్బ‌కు ష‌ర్టు కూడా కొంచెం కాలిపోయింది. దాని ధాటికి పెద్ద ఎత్తున పొగ చెల‌రేగింది. ముంబై భండూప్ ప్రాంతంలోని ఓ హోట‌ల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఓ వ్య‌క్తి హోట‌ల్‌లో కూర్చుని భోజ‌నం చేస్తున్న స‌మ‌యంలో అత‌ను త‌న ష‌ర్ట్ జేబులో పెట్టుకున్న ఫోన్ పేలింది. దీనితో ఉలిక్కిప‌డిన అత‌ను సెల్‌ఫోన్‌ను ప‌క్క‌న ప‌డేశాడు. తెల్ల‌ని పొగ అత‌ణ్ని ఆవ‌రించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో హోట‌ల్‌లో ఉన్న వారు బిత్త‌ర‌పోయారు. బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ఈ వ్య‌వ‌హారం అంతా అక్క‌డ అమ‌ర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here