ఈ యాడ్ త‌యారు చేసిందెవ‌రో గానీ.. దండేసి దండం పెట్టాలి!

ప్ర‌చారంపై రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉన్నంత యావ మ‌రెవ‌రికీ ఉండ‌దేమో! కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్‌. చేయ‌ని వాటికి కూడా చేశామ‌న్నంత బిల్డ‌ప్ ఇస్తుంటార‌ని రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులు వారిపై నిప్పులు చెరుగుతుంటారు.

 

ఆ విష‌యం ప‌క్క‌న పెడితే.. దేశంలోని అన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాల‌కు కూడా విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించడానికి కేంద్రం దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీక‌ర‌ణ యోజ‌న‌ను అమ‌లు చేస్తోంది. నిజానికి- ఇది యూపీఏ హ‌యాంలో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ రూపొందించిన ప‌థ‌కం.

 

అప్ప‌ట్లో దాని పేరు `రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీక‌ర‌ణ యోజ‌న‌.` మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దాని పేరు మార్చార‌నుకోండి అది వేరే విష‌యం. అస‌లు విష‌యం ఏమిటంటే- దేశంలో వంద‌శాతం గ్రామాల‌ను విద్యుదీక‌రించామ‌ని చెప్పుకొంటూ కేంద్ర‌ప్ర‌భుత్వం ఓ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్‌ను అన్ని పేప‌ర్ల‌లో అచ్చు వేయించింది. ఆ యాడ్ నిండా త‌ప్పులే.

న‌రేంద్ర‌మోడీ వెనుక గ్రామీణులు గుంపులు గుంపులుగా ఉన్న‌ట్లు ఓ ఫొటోను ప్ర‌చురించారు. ఆ ఫొటోలో ఒకే మ‌హిళ రెండు చోట్ల క‌నిపించింది. ఒకే మ‌హిళ‌, ఒకే ఫొటోలో రెండుచోట్ల ఎలా క‌నిపించింద‌నేది న‌రేంద్రుల‌వారే చెప్పాలి. ఇంకో త‌ప్పు కూడా ఉంది. ఓ వృద్ధురాలికి మీషాలు మొలిచిన‌ట్లు చూపించారు. ఫొటోషాప్‌లో వృద్ధుడి ఫొటోకు మీషాలు పెట్టి, త‌ల‌పై కొంగు క‌ప్పుకొన్న‌ట్టుగా క‌నిపిస్తోందా పిక్‌. దీన్ని బ‌ట్టి చూస్తే.. ఏమ‌నుకోవాలి?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here