మ‌హిళ‌పై అత్యాచార య‌త్నం చేసిన గ‌జ‌ల్ శ్రీ‌నివాస్..అరెస్ట్

తన వ‌ద్ద ప‌నిచేసే ఓ ఉద్యోగినిపై అత్యాచార య‌త్నం చేసిన కేసులు ప్ర‌ముఖ గాయ‌కుడు, న‌టుడు గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ విష‌యం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్ర‌కంప‌న‌లు రేపింది. వివాద‌ర‌హితుడిగా పేరున్న గ‌జ‌ల్ శ్రీ‌నివాస్‌పై లైంగిక వేధింపులు, అత్యాచార‌య‌త్నం కేసు న‌మోదు కావ‌డం సినీ జ‌నాల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది.

గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ సొంతంగా `ఆల‌య‌వాణి` అనే వెబ్ రేడియో సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంస్థ‌లో ప్రోగ్రామ్ హెడ్‌, రేడియో జాకీగా ప‌నిచేస్తోన్న మ‌హిళ‌ను గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ లైంగిక వేధించార‌ట‌.

దీనిపై బాధితురాలు కింద‌టి నెల 29న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాల‌ను కూడా ఆమె పోలీసుల‌కు అంద‌జేశారు.

దీనిపై అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేసిన త‌రువాత గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ఆ మ‌హిళను లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు తేలింద‌ని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఆయ‌న‌ను అరెస్టు చేశామ‌ని వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here