చాన్నాళ్ల త‌ర్వాత మోడీతో సెల్ఫీ!

న్యూఢిల్లీ: ప్ర‌ధానమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లో న‌రేంద్ర‌మోడీకి సెల్ఫీలు తీసుకునే అల‌వాటు ఉండేద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఏ దేశానికి వెళ్లినా, ఆ దేశాధ్య‌క్షులు, ప్ర‌ధానుల‌తో సెల్ఫీ దిగేవారు. వాటికి సంబంధించిన ఫొటోలో సోష‌ల్ మీడియాలో భ‌లేగా చ‌క్క‌ర్లు కొట్టేవి.

సెల్ఫీల‌పై ఎప్పుడైతే విమ‌ర్శ‌లు చెల‌రేగాయో.. ఆయ‌న కూడా క్ర‌మంగా దాన్ని త‌గ్గిస్తూ వ‌చ్చారు. తాజాగా- త‌నకు ఉన్న పాత అల‌వాటును మ‌రోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. దేశ రాజ‌ధానిలోని 26, అలీపూర్ రోడ్ మెట్రో స్టేష‌న్‌లో న‌రేంద్ర‌మోడీ సెల్ఫీ దిగారు. తోటి ప్ర‌యాణికుల‌తోనూ ఆయ‌న సెల్ఫీ దిగారు.

రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌ల‌కు ఒక‌రోజు ముందు.. ఆయ‌న న్యూఢిల్లీలో నిర్మించిన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ జాతీయ స్మార‌క కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి లోక్‌మాన్య మార్గ్ స్టేష‌న్ నుంచి 26, అలీపూర్ రోడ్ స్టేష‌న్ వ‌ర‌కూ మెట్రో రైలులో ప్ర‌యాణం చేశారు. చివ‌రిసారిగా మోడీ 2015 సెప్టెంబ‌ర్‌లో ఆయ‌న ఢిల్లీ మెట్రోలో ప్ర‌యాణించారు. అంబేద్క‌ర్ జాతీయ స్మార‌క కేంద్రంలో ఓ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంబేద్క‌ర్ జీవిత చ‌రిత్ర‌కు సంబంధించిన ప‌లు ఫొటోలను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here