అద్వానీ న‌మ‌స్క‌రిస్తున్నా..క‌న్నెత్తి చూడ‌ని మోడీ

అగ‌ర్త‌లా: ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం..బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం అనే సామెత‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ. దేశ‌వ్యాప్తంగా బీజేపీని అత్యున్న‌త స్థాయికి తీసుకుని రావ‌డానికి ర‌క్తం ధార‌బోసిన అద్వానీ ఇప్పుడు సొంత పార్టీ వారికే కానివార‌య్యారు.

పార్టీ ప‌గ్గాలు న‌రేంద్ర‌మోడీ- అమిత్‌షా చేతుల్లోకి వెళ్లిన త‌రువాత అద్వానీ స్థాన‌మేంట‌న్న‌ది ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద్వానీ ఇంకా రాజ‌కీయాల నుంచి ఎందుకు రిటైర్ కాలేదంటూ గ‌తంలో ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు దాన్ని చేత‌ల్లో చూపిస్తున్నారు. బీజేపీకి చుక్కానిలా వ్య‌వ‌హ‌రించిన అద్వానీకి త్రిపుర‌లో చేదు అనుభ‌వం ఎదురైంది.

అదీ త‌న జూనియ‌ర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నుంచి. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజ‌రైన అద్వానీని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు మోడీ. మోడీ స్టేజ్ పైకి రాగానే ఆయనకు స్వాగతం ప‌ల‌క‌డానికి అద్వానీ స‌హా అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌, ఆ రాష్ట్ర మాజీ సీఎం మాణిక్ స‌ర్కార్ లేచి నిలబడ్డారు.

అందరి నమస్కారాలకూ ప్రతి నమస్కారంతో స్పందిస్తూ వచ్చిన మోడీ..అద్వానీ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ఆయ‌న వైపు చూడ‌ను కూడా చూల్లేదు. అద్వానీ లేచి నిల్చుని ప్ర‌ధానికి నమస్కారం చేసినప్పటికీ ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకుండా విసవిసా ముందుకు వెళ్లారు.

అద్వానీ పక్కనే ఉన్న మాణిక్ సర్కార్‌తో నవ్వుతూ కరచాలనం చేశారు. దీన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయారు అద్వానీ. మోడీ వైఖ‌రిని నెటిజ‌న్లు తూర్పార బ‌ట్టారు. ఆయన ‘దురహంకారాన్ని’ చాటుతుందని విమ‌ర్శించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here