పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కోహ్లీని ఎప్పటికీ వదులుకోమని తేల్చింది..!

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. నీరవ్ మోడీ చేసిన మోసాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది. ఏకంగా 11వేల కోట్ల రూపాయలంటే మాటలా చెప్పండి.. బ్యాంకు గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.. పాపం రైతులకు లోన్లు ఇచ్చేకి అయితే ఏడుస్తుందని.. కానీ నీరవ్ లాంటి మోసగాళ్ళకు అయితే డబ్బులు ఈజీగా ఇచ్చేస్తుందని చెబుతూ వచ్చారు. ఇక ఇంకో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదేమిటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ బ్యాంకుతో తెగదెంపులు చేసుకుంటూ ఉన్నాడని..!

దీనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజమాన్యం స్పందించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని తెలిపింది. తమ బ్రాండ్ అంబాసడర్ గా కోహ్లీ కొనసాగుతాడని… అతనిని వదులుకోబోమని ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని తగ్గించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా అవాస్తవమేనని పేర్కొంది. మరోవైపు నీరవ్ మోడీ డైమండ్స్ కు ప్రచారకర్తలుగా ఉన్న ఒక్కొక్కరూ వాటి నుండి వైదొలుగుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా తెగదెంపులు చేసుకుంది. అలాగే నీరవ్ ఆస్థులను పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here