అప్పటికే 38 లక్షలు గెలిచాడు.. బంతి నంబర్ 22 నలుపు రంగు మీదే నిలుస్తుందని పందెం కాశాడు..!

పోకర్.. అదీ ఒక రకమైన జూదం.. అందులో ఏకంగా 38లక్షల రూపాయలు గెలిచాడు ఒక వ్యక్తి.. ఎవరైనా అంత మొత్తంలో డబ్బులు గెలిస్తే దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ వ్యక్తి అక్కడితో ఆగిపోలేదు రౌలెట్ టేబుల్ ముందుకు వచ్చాడు. రౌలెట్ టేబుల్ మీద నలుపు, ఎరుపు రంగులు ఉన్నాయి.. వాటిలో బంతి నిలవాలి.. పోకర్ లో సంపాదించిన డబ్బును తీసుకొని వచ్చి రౌలెట్ లో బంతి నలుపు మీదనే నిలుస్తుందని పందెం కాశాడు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..

పోకర్ అనేది మన పేకాట లాంటిదే.. నాటింగ్హామ్ లో జరిగిన యునైటెడ్ కింగ్డమ్ పోకర్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో జేక్ కోడీ ఏకంగా 38 లక్షల ప్రైజ్ మనీ గెలిచాడు. ఆ రోజు తన సుడి బాగా తిరుగుతోంది అని భావించిన జేక్.. ఆ డబ్బును తీసుకొని రౌలెట్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఆ డబ్బునంతా 22 నంబర్ బ్లాక్ రంగు మీద పడుతుంది అని చెప్పాడు. ఆ రౌలెట్ స్పిన్ అయింది.. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎంతో టెన్షన్ గా చూస్తూ ఉండిపోయారు. అయితే ఈ సారి కూడా అతన్నే అదృష్ట దేవత వరించింది. అది కాస్తా అతడు చెప్పిన నంబర్ మీదనే పడింది. ఇంకేముంది ఏకంగా 85,000 వేల పౌండ్ల జాక్ పాట్ అతడికి తగిలింది. అంటే భారత కరెన్సీలో ఏకంగా 76లక్షల పైమాటే.. అతడు జాక్ పాట్ గెలవగానే క్యాసినో మొత్తం అరుపులతో నిండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాక్ అదృష్టం ఏ రేంజిలో ఉందో..

Jake Cody puts £42,670 high roller win on the roulette wheel!

After a four-way chop, Jake Cody put his entire £42,670 on black! Video credit: Ant Samuel.

PokerNewsさんの投稿 2018年2月26日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here