భార్య చేతుల‌ను క‌ట్టి..ఇంటి పైక‌ప్పున‌కు వేలాడ దీసి!

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అద‌న‌పు క‌ట్నం ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో భార్య‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడో వ్య‌క్తి. చేతులు పైకి క‌ట్టేసి, రెండు గంట‌ల పాటు చిత్ర‌హింస‌లు పెట్టాడు. దాన్ని వీడియో తీసి, అత్తామ‌మ‌ల‌కు పంపించాడు. డ‌బ్బులు ఇచ్చేంత వ‌ర‌కూ ఇలాగే కొడుతుంటాన‌ని బెదిరించాడు.

జిల్లాలోని కొత్వాలీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఇందేపూర్‌కు చెందిన వినోద్ శుక్ల కుమార్తె రుచి శుక్లా వివాహం ల‌ఖీమ్‌పూర్‌కు చెందిన అశోక్‌తో రెండేళ్ల‌ కింద‌ట జ‌రిగింది. అశోక్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. వారికి ఓ కుమారుడు. పెళ్ల‌యిన తొలి రోజుల్లో నుంచే అద‌న‌పు క‌ట్నం కోసం వేధించేవాడ‌ని బాధితురాలు ఆరోపించారు.

కుమారుడు పుట్టాడ‌నే సంతోషంతో బంధు, మిత్రుల‌కు విందు ఇవ్వాల‌ని, దీనికోసం డ‌బ్బులు తీసుకుని ర‌మ్మ‌ని త‌న‌ను కొట్టేవాడ‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో శ‌నివారం సాయంత్రం రుచి శుక్లాను రెండు గంట‌ల పాటు బెల్టుతో చావ‌బాదాడు.

ఆమె స్పృహ త‌ప్పి ప‌డిపోగా.. చేతుల‌ను పైకి క‌ట్టి, వేలాడ దీసి మ‌రీ కొట్టారు. భ‌ర్త కొడుతూ ఉంటే అత్తామ‌మ‌లు వీడియో తీసి, ఆమె త‌ల్లిదండ్రుల‌కు వాట్స‌ప్ ద్వారా పంపించారు. ఈ వీడియోను చూసిన వినోద్ శుక్లా షాక్‌కు గుర‌య్యారు. వెంట‌నే కొత్వాలి పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అశోక్‌, అత‌ని త‌ల్లిదండ్రుల‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here