ఆ మహిళా క్రికెటర్ డ్రగ్స్ ను తరలిస్తోందా..!

నజ్రీన్ ఖాన్ ముక్తా.. 23 ఏళ్ల బంగ్లాదేశీ మహిళను ఆదివారం నాడు ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 14 వేల మెటామెఫ్టామైన్ మాత్రలు ఉన్నాయి. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బక్లియా పోలీస్ స్టేషన్ లో ఆమెను ఉంచారు.. అయితే తాను ఓ క్రికెటర్ అని ఆ మహిళ చెప్పుకోండి. బంగ్లాదేశ్ అన్సర్ టీమ్ కూ.. వీడీపీ క్రికెట్ టీమ్ కూ ఆమె ఆడానని చెప్పుకోవడంతో షాక్ తిన్నారు పోలీసులు. మహిళా క్రికెటర్ అయి ఉండి ఈ పనులు ఏంటని ఆమెను ప్రశ్నించారు.

నజ్రీన్ ఖాన్ ముక్తా ఆమె ప్రయాణిస్తున్న బస్సును చిట్టగాంగ్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు ఆమె నుంచి భారీస్థాయిలో ఈ మాత్రను స్వాధీనం చేసుకున్నారు. 14 వేల మెటామెఫ్టామైన్‌ మాత్రలను ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసును నజ్రీన్‌పై నమోదు చేశారు. నేరం కనుక రుజువైతే ఆమెకు జీవిత ఖైదును ఎదుర్కోక తప్పదని పోలీసులు చెబుతున్నారు. నజ్రీన్ మొదట్లో క్రికెట్ బాగా ఆడేదని.. కానీ రాను రానూ.. ప్రాక్టీస్ కు కూడా ఎగ్గొట్టేదని వీడీపీ క్రికెట్ టీమ్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. తాను చేసిన తప్పును నజ్రీన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాను పలుమార్లు డ్రగ్స్ ను సప్లై చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here