వితంతురాలైన వ‌దినపై మ‌రిది అత్యాచారం: వీడియో తీసిన బాధితురాలు

ల‌క్నో: అనారోగ్యం కార‌ణంగా భ‌ర్త‌ను పోగొట్టుకున్న మ‌హిళ‌కు అండ‌గా నిల‌వాల్సింది పోయి, ఆమెపై ఆకృత్యానికి పాల్ప‌డ్డాడు ఆమె మ‌రిది. పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి, మోస‌గించాడు. లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. వితంతురాలైన వ‌దినెపై అత్యాచారం చేశాడు. అత‌ని ఘాతుకాల‌ను భ‌రించ‌లేక‌.. బాధితురాలు దీన్నంత‌టినీ వీడియో తీసింది. దాన్ని పోలీసుల‌కు అప్ప‌గించింది.

ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని షెహ‌జాద్ న‌గ‌ర్‌కు చెందిన రుక్సానాకు మూడేళ్ల కింద‌ట పెళ్ల‌యింది. అత్తామామ‌, భ‌ర్త, మ‌రిదితో పాటు ఆమె షెహ‌జాద్‌న‌గ‌ర్‌లో నివ‌సిస్తోంది. ఎనిమిది నెల‌ల కింద‌ట ఆమె భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. అత‌ను మ‌ర‌ణించిన కొద్దిరోజుల‌కే మ‌రిది క‌న్ను రుక్సానాపై ప‌డింది.

పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, ఆమెను మోసం చేశాడు. శారీర‌కంగా లోబ‌ర‌చుకున్నాడు. రోజూ అత‌ని చేష్ట‌లు, ఒత్తిళ్ల‌ను భ‌రించ‌లేక పోయింది. రెండురోజుల కింద‌ట ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డిన మ‌రిది వీడియోను తీసింది. దాన్ని పోలీసుల‌కు అప్ప‌గించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు. క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here