ప్రేమ తిర‌స్క‌రించింద‌ని అత్యాచారం..గ‌ర్భం దాల్చిన బాలిక

భువ‌నేశ్వ‌ర్‌: ప‌్రేమ‌ను తిర‌స్క‌రించింద‌నే ఆగ్ర‌హంతో 13 సంవ‌త్స‌రాల బాలిక‌పై అత్యాచారం చేశాడో యువ‌కుడు. జ‌న‌వ‌రిలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న.. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఒడిశాలోని న‌యాగ‌ఢ్ జిల్లా నువాగావ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ కిరాత‌క ఘ‌ట‌న జ‌రిగింది. నిందితుడిని మార్బుల్ కార్మికుడు దుర్యోధ‌న్ దాస్‌గా గుర్తించారు.

జ‌న‌వ‌రిలో ఓ శుభకార్యంలో పాల్గొన‌డానికి బాధిత బాలిక సువాన్‌పాడా గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అంత‌కుముందు నుంచే దుర్యోధ‌న్ దాస్ ప్రేమ పేరుతో ఆ బాలిక వెంట ప‌డేవాడు. బాలిక సువాన్‌పాడా గ్రామానికి వెళ్లిన విష‌యం తెలుసుక‌న్న అత‌ను కూడా అక్క‌డికి వెళ్లాడు. బాలిక ఒంటరిగా తిరిగి వ‌స్తుండ‌గా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అత్యాచారం చేశాడు.

ఈ విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు. దీనితో భ‌య‌ప‌డ్డ బాధిత బాలిక మౌనం వ‌హించింది. తాజాగా ఆమె అనారోగ్యానికి గురి కావ‌డం, వాంతులు చేసుకోవ‌డంతో త‌ల్లి ఆసుప‌త్రికి తీసుకెళ్లింది. దీనితో ఆమె గ‌ర్భం దాల్చిందనే విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. బాధిత బాలిక అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించ‌డంతో ఆమె త‌ల్లి నువాగావ్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here