చిరు తిండ్లు అమ్మ‌డానికొచ్చి..ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక‌పై క‌న్నేసి..!

ఎనిమిదేళ్ల బాలిక‌పై అత్యాచార య‌త్నం చేసిన ఓ యువ‌కుడిని స్థానికులు ప‌ట్టుకుని ఉతికి ఆరేశారు. పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఈ ఘ‌టన ఒడిశాలోని కేంద్ర‌పారా జిల్లా డేరాబిష్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని తిలంగ్ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు మిహిర్ సింగ్‌. జిల్లాలోని హాల్దియా గ్రామ నివాసి. సైకిల్‌పై చిరుతిండ్లు అమ్ముకుంటూ తిరిగుతుంటాడు.

పొరుగునే ఉన్న తిలంగ్ గ్రామానికి వ‌చ్చిన మిహిర్ సింగ్‌.. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక‌పై క‌న్నేశాడు. పేద కుటుంబానికి చెందిన ఆ బాలిక ఇద్ద‌రు స్నేహితుల‌తో ఇంటి బ‌య‌ట ఆడుకుంటుండ‌గా.. డ‌బ్బు ఆశ చూపాడు. త‌న‌తో తీసుకెళ్లాడు. ప‌ణి పంచాయితీ కార్యాల‌య భ‌వ‌నం స‌మీపంలో ఓ పాడుబ‌డ్డ క‌మ్యూనిటీ సెంట‌ర్ భ‌వ‌నంలోకి తీసుకెళ్లి, అత్యాచార య‌త్నం చేశాడు.

బాధిత బాలిక‌తో ఆడుకుంటున్న తోటి స్నేహితులు ఈ విష‌యాన్ని వెంట‌నే ఆమె త‌ల్లిదండ్రులు, సోద‌రుడికి తెలియ‌జేశారు. దీనితో వారు- వెదుక్కుంటూ వెళ్లారు. స్నేహితులు చెప్పిన మార్గంలో వెళ్తుండ‌గా.. క‌మ్యూనిటీ సెంట‌ర్ వ‌ద్ద సైకిల్ క‌నిపించింది.

ఆ వెంట‌నే బాలిక కేక‌లు వినిపించ‌డంత వెళ్లి బాలిక‌ను ర‌క్షించారు. పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించిన మిహిర్‌సింగ్‌ను ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. డేరాబిష్ పోలీసుల‌కు అప్ప‌గించారు. పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు. పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here