గిరిజ‌న యువ‌తిపై గ్యాంగ్‌రేప్‌..వీడియో! వాట్స‌ప్‌ల‌ల్లో షేరింగ్‌

భువ‌నేశ్వ‌ర్: ఒడిశాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 18 సంవ‌త్స‌రాల గిరిజ‌న యువ‌తి ఒక‌రు సామూహిక అత్యాచారానికి గుర‌య్యారు. క‌ల‌హండి జిల్లాలోని జునాగ‌ఢ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో కింద‌టి నెల 31వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది.

బాధితురాలిని అప‌హ‌రించిన ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణాన్ని మొబైల్ ద్వారా వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. జునాగ‌ఢ్ స‌మీపంలోని భ‌ట్ర‌గూడ గ్రామానికి చెందిన బాధితురాలు ఆల‌యానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా.. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువ‌కులు ఆమెను అప‌హ‌రించారు.

 

బ‌ల‌వంతంగా మ‌ద్యాన్ని తాగించారు. ఆమెపై ఆకృత్యానికి తెగ‌బ‌డ్డారు. ఆ ముగ్గురూ త‌న‌కు ముందే ప‌రిచ‌యం ఉన్నార‌ని బాధితురాలు పోలీసుల‌కు వెల్ల‌డించింది. త‌న గ్రామానికే చెందిన చిత్త‌రంజ‌న్ గురు, ముకుంద్‌, సుశాంత్‌లు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు ఫిర్యాదు చేసింది.

ఈ విష‌యం బ‌య‌టికి పొక్కితే ప‌రువు పోతుంద‌నే భ‌యంతో తాను ఇన్నిరోజులూ ఫిర్యాదు చేయ‌లేద‌ని, నిందితులు అత్యాచార ఘ‌ట‌న‌ను వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని, ఆ వీడియోల‌ను చూపించి, త‌న‌ను లొంగ‌దీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here