ఒంట‌రిగా వెళ్తోన్న‌ యువ‌తిని ఆటోలోకి లాగ‌బోయి..!

ఒంట‌రిగా వెళ్తోన్న ఓ యువ‌తిపై దౌర్జ‌న్యం చేశాడో ఆటో డ్రైవ‌ర్‌. ప్రేమిస్తున్నానంటూ వెంట‌బ‌డ్డాడు. ఆమెను బ‌ల‌వంత‌గా త‌న ఆటోలోకి ఎక్కించ‌బోయాడు. దీన్ని చూసిన స్థానికులు అత‌ణ్ని ప‌ట్టుకుని, దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్పగించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లిలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు ర‌మేష్‌. స్థానికంగా ఆటోడ్రైవ‌ర్‌.

కొంత‌కాలంగా అత‌ను ప్రేమ పేరుతో ఓ యువ‌తిని వేధిస్తున్నాడు. శుక్ర‌వారం సాయంత్రం హుబ్బ‌ళ్లిలోని నేకార న‌గ‌ర స‌మీపంలోని వంతెనపై ఆమె ఒంట‌రిగా వెళ్తూ క‌నిపించింది. ఆమెను గ‌మ‌నించిన ర‌మేష్ ఆటోలో ఆమె వెంట ప‌డ్డాడు. త‌న ప్రేమ‌ను అంగీక‌రించాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఆమెను అట‌కాయించాడు.

చెయ్యి ప‌ట్టుకుని బ‌ల‌వంతంగా ఆటోలోకి ఎక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. ఊహించ‌ని ఈ ఘ‌ట‌న‌తో బిత్త‌ర‌పోయిన ఆ యువతి గ‌ట్టిగా కేక‌లు వేసింది. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు ర‌మేష్‌ను ఉతికి ఆరేశారు. హుబ్బ‌ళ్లి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఆ యువ‌తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అత‌ణ్ని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here