ఆసుప‌త్రికి వ‌చ్చిన మ‌హిళా రోగితో అక్ర‌మ సంబంధం..! పెన్‌డ్రైవ్‌లో అన్నీ అలాంటి వీడియోలే!

రోగాన్ని న‌యం చేసుకోవ‌డానికి ఆసుప‌త్రికి వ‌చ్చిన మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధాన్ని పెట్టుకున్న ఓ డాక్ట‌ర్ ఉదంతం ఇది. ఆ మ‌హిళా రోగితో గ‌డిసిన క్ష‌ణాల‌ను వీడియో తీసి, దాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరించి, ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. చివ‌రికి- అత‌ని వేధింపుల‌ను భ‌రించ‌లేక ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఆ కీచ‌క డాక్ట‌ర్ అక్ర‌మాల‌కు తెర‌ప‌డింది.

గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో చోటు చేసుకుంది. వ‌డోద‌ర శివార్ల‌లోని అన్‌గ‌ఢ్‌లో చోటు చేసుకుంది. ఆ డాక్ట‌ర్ పేరు ప్ర‌తీక్ జోషి. బీహెచ్ఎంఎస్ చేశాడు. కొంత‌కాలంగా అన్‌గ‌ఢ్‌లో హోమియోప‌తి క్లినిక్‌ను న‌డిపిస్తున్నాడు.

హోమియోప‌తి క్లినిక్ కావ‌డంతో పెద్ద‌గా రోగులు వ‌చ్చే వారు కాదు. దీనితో క్లినిక్ వ‌చ్చే ఒక‌రిద్ద‌రు మ‌హిళ‌ల‌ను లొంగ‌దీసుకున్నాడు. చికిత్స పేరుతో లైంగికంగా వేధించాడు. త‌న సెల్‌ఫోన్ ద్వారా వాటిని చిత్రీక‌రించాడు. ఆ వీడియోల‌ను చూపిస్తూ, త‌ర‌చూ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

అత‌ని వేధింపుల‌ను భ‌రించ‌లేక ఓ మ‌హిళ స్థానిక ఆసుప‌త్రిలో ఫిర్యాదు చేశారు. దీనితో అత‌ని బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. పోలీసులు ప్ర‌తీక్‌ను అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అన్నీ సెక్స్ క్లిప్పింగులే క‌నిపించాయి. ప్ర‌తీక్‌తో పాటు కాంపౌండ‌ర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here