బాగా తెలివిమీరి పోయిన యువతి.. అబ్బాయిలను మోసం చేసి చేసి అడ్డంగా బుక్ అయిపోయింది..!

లవ్.. సెక్స్.. ఆ తర్వాత బెదిరింపులు.. బాగా తెలివిమీరిపోయిన ఓ యువతిని ఆమె గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు.. ఎందఱో యువకులను బెదిరించి లక్షల రూపాయల డబ్బును కాజేశారు. యువకులతో పరిచయం పెంచుకోవడం.. ఆ తర్వాత వారితో శృంగారంలో పాల్గొనడం.. రేప్ చేశారంటూ ఆమె తన గ్యాంగ్ తో కలిసి వారిని బెదిరించడం.. ఇలాంటివి చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ యువతిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నర్వానా ప్రాంతానికి చెందిన ఓ యువతి పలువురు యువకులతో పరిచయం పెంచుకుంది. వారితో ప్రేమలో ఉన్నట్లు నటించి ముగ్గులోకి దింపేది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడు.. అని తన బంధువులకు కబురు చేసేది. వారి దెబ్బ నుండి బయటపడడానికి బాధితులు ఎంతో కొంత డబ్బులు ఇస్తాము అని చెప్పేవారు. అలా పలువురిని మోసం చేస్తూ లక్షలు సంపాదించారు.

తాజాగా ఓ యువకుడితో కూడా ఇలాగే డ్రామా ఆడింది. 25 లక్షలు ఇస్తే కేసు లాంటివి పెట్టము అని కుటుంబ సభ్యులుగా నటిస్తున్న వారితో చెప్పించింది. ఆ డీల్ 12 లక్షలకు ఫిక్స్ అయింది. ఆ సమయంలో బాధితుడి సోదరుడు ఎస్పీని సంప్రదించాడు.దీంతో ఆయన స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశాడు. ఆ స్పెషల్ టీమ్ చేసిన విచారణలో ఆ అమ్మాయి.. వారి బ్యాచ్ పెద్ద ఫ్రాడ్ లు అని తేలింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల లోని పలువురు యువకులను ఇలాగే మోసం చేశారట. కొందరి దగ్గర నుండి 2 లక్షలు లాగితే మరికొందరి దగ్గర 10 లక్షలు కూడా లాగినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here