జూనియ‌ర్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లోనే వివాహిత‌పై గ్యాంగ్‌రేప్‌!

తెలంగాణ‌లోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. వివాహితపై న‌లుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. జిల్లాలోని క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణం న‌డిబొడ్డున ఉన్న ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ఆవ‌ర‌ణలోనే ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం స్థానికుల‌ను ఆందోళ‌న‌కు గురి చేసింది.

స్పృహ కోల్పోయిన బాధితురాలిని సంఘ‌ట‌నాస్థ‌లంలోనే వ‌దిలేసి వెళ్లిపోయారు ఆ కీచకులు. మెళ‌కువ వ‌చ్చిన అనంత‌రం బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణానికే చెందిన బాధితురాలు ఒంట‌రిగా వెళ్తుండ‌గా.. న‌లుగురు యువ‌కులు ఆమెను అడ్డ‌గించి- జూనియ‌ర్ కళాశాల ఆవ‌ర‌ణ‌లోకి లాక్కెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆమెను అక్క‌డే వ‌దిలేసి పారిపోయారు.

వారి ఉన్మాదానికి బాధితురాలు స్పృహ కోల్పోయింది. అనంత‌రం ఆమె డ‌య‌ల్‌ 100కు ఫోన్ చేసింది. ఈ ఘట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్‌పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. న‌లుగురినీ అరెస్టు చేశామ‌ని, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here