క‌ట్టుకున్న భార్య‌పై అనుమానం! ప్రైవేట్ పార్ట్‌ల‌ను కోసి..కారం చ‌ల్లిన భ‌ర్త‌!

క‌ట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె భర్త అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమెను కిరాతకంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె ప్రైవేట్ పార్ట్‌ల‌ను క‌త్తితో కోసి, కారం చ‌ల్లాడు. క‌ణ‌క‌ణ‌మండే నిప్పుతో కాల్చాడు. పైశాచిక ఆనందాన్ని పొందాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ శాడిస్ట్ భ‌ర్త పేరు రాజు.

బేతంచెర్ల మండలానికి చెందిన యువతిని.. కృష్ణగిరి మండలానికి చెందిన రాజు పెళ్లి చేసుకున్నాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ పెళ్లి జ‌రిగింది. రాజుకు అది రెండో వివాహం. పెళ్లయిన తొలి రోజుల్లో నుంచే రాజుకు త‌న భార్య ప‌ట్ల అనుమానం మొద‌లైంది. దాన్ని నివృత్తి చేసుకోవ‌డానికి బ‌దులుగా రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించ సాగాడు. భార్యపై అనుమానంతో పలుమార్లు చిత్రహింసలకు గురిచేశారు.

మంగళవారం త‌న శాడిజాన్ని చూపాడు. భార్య కాళ్లు, చేతులు క‌ట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆమె ప్రైవేటు పార్టుల‌ను కోసి కారం పెట్టాడు. నిప్పుకర్రతో ఆమె కాళ్లు, నడుము భాగంలో కాల్చాడు. రాత్రంతా ఈ బాధలను భరించిన యువతి.. ఉదయం అతను లేని సమయంలో ఇంట్లో నుంచి తప్పించుకొని కృష్ణగిరి పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడు రాజు మొదటి నుంచి అనుమాన ధోరణితో వ్యవహరించేవాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. అత‌ణ్ని అరెస్టు చేశారు. మొద‌టి భార్య‌ను కూడా ఇలా చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌డం వ‌ల్ల ఆమె అత‌ణ్ని వ‌దిలి పుట్టింటికి వెళ్లింద‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here