పోర్న్ చూడందే నిద్ర‌ప‌ట్ట‌ని యువ‌కుడు..త‌ల్లిపైనే అత్యాచారం చేశాడు!

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో కిరాత‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోర్న్ క్లిప్‌లు, పోర్న్ వీడియోల‌ను చూడ‌టానికి బానిస‌గా మారిన ఓ యువ‌కుడు 46 సంవ‌త్స‌రాల మారుత‌ల్లినే చెర‌బ‌ట్టాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. గుజ‌రాత్‌లో పాట‌న్ జిల్లాకేంద్రంలోని జ‌ల్ చౌక్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆ యువ‌కుడిని అరెస్టు చేశారు.

ఈ నెల 19వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న బాధితురాలి ఫిర్యాదు చేసిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చింది. జ‌ల్‌చౌక్‌లో నివసిస్తోన్న మ‌హిళ భ‌ర్త వృత్తి రీత్యా వేరే న‌గ‌రంలో ఉంటున్నాడు. భ‌ర్త మొద‌టి భార్య కుమారుడు, సొంత‌ కుమార్తెతో క‌లిసి ఆ మ‌హిళ జ‌ల్‌చౌక్ ప్రాంతంలో నివ‌సిస్తోంది.

22 సంవ‌త్స‌రాల కుమారుడు పోర్న్ వీడియోల‌ను చూడ‌టానికి అల‌వాటు ప‌డ్డాడు. ఆ అల‌వాటు ముదిరి బానిస‌గా అయ్యాడు. 19 సంవ‌త్స‌రాల త‌న చెల్లెలు ఎదురుగానే ప‌లుమార్లు అత‌ను త‌న సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూశాడు. దీనిపై మారుత‌ల్లి త‌ర‌చూ అత‌నితో గొడ‌వ ప‌డుతుండేది.

గురువారం అర్ధ‌రాత్రి వ‌ర‌కూ సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూసిన ఆ దుర్మార్గుడు ఒంటిగంట ప్రాంతంలో మారుత‌ల్లిపై అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై శ‌నివారం బాధితురాల పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో అత‌ని కిరాత‌కం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న వెంట‌నే పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here