ఆరో త‌ర‌గ‌తి విద్యార్థినిపై అమానుషం! రెండురోజుల పాటు నిర్బంధించి, అత్యాచారం

భువ‌నేశ్వ‌ర్‌: ఆర‌వ త‌ర‌గ‌తి చ‌దివే ఓ విద్యార్థిని అత్యాచారానికి గురైన సంఘ‌ట‌న ఒడిశాలోని క‌ల‌హండి జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె స‌మీప బంధువే ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. రెండు రోజుల పాటు ఆమెను నిర్బంధించి అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. జిల్లాలోని థువాముల్ రామ్‌పూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని డుమేరాప‌ద‌ర్‌ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు జ‌రిగింది.

 

ఈ ఘ‌ట‌న‌లో మున్న నాయ‌క్ అనే యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మున్నా నాయ‌క్ బాధిత విద్యార్థిని స‌మీప బంధ‌వు. బంధువు ఇంట్లో శుభ కార్యంలో పాల్గొన‌డానికి ఈ నెల 17వ తేదీన బాధిత విద్యార్థిని డుమేరాప‌ద‌ర్ గ్రామానికి వెళ్లింది. ఆమె వెంట త‌ల్లిదండ్రులు లేరు. ఒంటరిగా ఆమె ఆ శుభకార్యానికి హాజ‌రైంది.

ఆమె వెంట ఎవ‌రూ లేక‌పోవ‌డాన్ని ఆస‌రాగా చేసుకున్న మున్న నాయ‌క్‌.. విద్యార్థినిని త‌న ఇంట్లోనే బంధించాడు. రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు. అత‌ని చెర‌లో నుంచి త‌ప్పించుకున్న బాధిత విద్యార్థిని 19వ తేదీన ఇంటికి చేరుకుంది. త‌న‌పై జ‌రిగిన ఆకృత్యాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించింది. వెంట‌నే వారు థువాముల్ రామ్‌పూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

 

త‌మ కుమార్తె బంధువుల ఇంట్లో ఆనందంగా ఉంద‌ని అనుకున్నామ‌ని, ఇలా ఆకృత్యానికి గుర‌వుతుంద‌ని భావించ‌లేదంటూ త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మున్నా నాయ‌క్‌ను అరెస్టు చేశారు. అత‌నిపై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. బాధిత విద్యార్థినిని వైద్య ప‌రీక్షల కోసం క‌ల‌హండి జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here