ప్రియుడితో వెళ్తోన్న యువ‌తిని అడ్డ‌గించారు! అత‌ణ్ణి త‌న్ని త‌రిమేశారు..ఆమెను!

రాంచీ: జార్ఖండ్ రాజ‌ధానిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ప్రియుడితో క‌లిసి కాలిన‌డ‌క‌న వెళ్తోన్న యువ‌తిని అడ్డ‌గించారు కొంద‌రు దుర్మార్గులు. ప్రియుడిని త‌న్ని త‌రిమేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. పొద‌ల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

ఈ దారుణ ఘ‌ట‌నంలో మొత్తం ఎనిమిది మంది పాల్గొన్న‌ట్టు బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారిలో ఏడుమందిని అరెస్టు చేశామ‌ని, మ‌రొక‌రి కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

శ‌నివారం రాత్రి రాంచీలోని ధృవ లోకాలిటీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధితురాలు డిగ్రీ విద్యార్థిని. రాంచీలోని త‌న బంధువుల ఇంట్లో ఉంటూ చ‌దువుకుంటోంది. రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో త‌న ప్రియుడితో క‌లిసి ధృవ లొకాలిటీ ప్రాంతంలో కాలి న‌డ‌క‌న వెళ్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను అడ్డ‌గించి, ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.

అడ్డొచ్చిన ప్రియుడిని తీవ్రంగా కొట్ట‌డంతో అత‌ను అక్క‌డి నుంచి పారిపోయాడు. దీనితో ఒంట‌రిగా మిగిలిన ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఫిర్యాదు న‌మోదు చేసుకున్న వెంట‌నే పోలీసులు శ‌ర‌వేగంగా స్పందించారు. ఆదివారం సాయంత్రానికి ఏడుమంది రేపిస్టుల‌ను అరెస్టు చేశారు. మ‌రొక‌రి కోసం గాలిస్తున్నామ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here