హిజ్రాల పేరు చెప్పుకొని..బురఖా ధ‌రించి..!

ఇద్ద‌రు బాల‌లు. బుర‌ఖా వేసుకుంటే ఏమౌతుందో చూద్దామ‌ని ఆలోచ‌న ఎలా వ‌చ్చిందో గానీ.. రావ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించారు. వెనుకా ముందూ ఆలోచించ‌లేదు. రెండు బుర‌ఖాలు కొనుకున్నారు. వాటిని వేసుకుని టిప్‌టాప్‌గా త‌యార‌య్యారు. భుజానికి బ్యాక్‌ప్యాక్ త‌గిలించుకుని మ‌రీ బ‌జారుకు బ‌య‌లుదేరారు.

బుర‌ఖా వేసుకున్నంత మాత్రాన ఆడ‌వారిలా మారిపోరు క‌దా! వారి ప్ర‌వ‌ర్త‌న‌, న‌డ‌త‌, న‌డ‌క‌ను గమ‌నించిన స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది. ధైర్యం చేసి బుర‌ఖాను తొల‌గించి చూడ‌గా.. అస‌లు విష‌యం బ‌ట్టబ‌య‌లైంది. ఇద్ద‌రికీ దేహ‌శుద్ధి చేసి, పోలీసుల‌కు అప్ప‌గించారు.

క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరు జిల్లా కుణిగ‌ల్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. త‌మ గుట్టు ర‌ట్టు కావ‌డంతో ఆ ఇద్ద‌రు బాల‌లు.. తాము హిజ్రాల‌మ‌ని చెప్పి, త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు గానీ కుద‌ర్లేదు. ఆ ఇద్ద‌రు యువ‌కుల పేర్లు వెల్ల‌డి కాలేదు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here