నిల్చుని పాడ‌ట్లేద‌ని..గాయ‌నిని కాల్చి చంపారు! ఆమె ఆరునెల‌ల గ‌ర్భిణి!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గాయ‌ని నిల్చుని పాడ‌ట్లేద‌నే కార‌ణంతో ఆమెను కాల్చి చంపాడో వ్య‌క్తి. వంద‌లాది మంది స‌మ‌క్షంలోనే అత‌ను ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. బుల్లెట్లు ఆమె శ‌రీరంలో నుంచి దూసుకెళ్ల‌డంతో సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించిందా గాయ‌ని. ఆమె ఆరునెల‌ల గ‌ర్భిణి కావ‌డం విషాద‌క‌రం.

 

 

పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ల‌ర్కానా జిల్లాలో ఈ దారుణం సంభవించింది. ఆ గాయ‌ని పేరు స‌మీనా స‌మూన్‌. 24 సంవ‌త్స‌రాల స‌మీనా `సింధ్ గాయ‌ని`గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ల‌ర్కానా జిల్లాలోని కంగా గ్రామంలో బుధ‌వారం రాత్రి ఉరుసు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రామినిక వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌రయ్యారు.

 

 

ఉరుసు సంద‌ర్భంగా స‌మీనాతో పాట క‌చేరీని ఏర్పాటు చేశారు నిర్వాహ‌కులు. సింధ్ యాస‌లో పాట‌లు పాడ‌టంతో నిష్ణాతురాలైన స‌మీనా ఆరు నెల‌ల గ‌ర్భిణి. గ‌ర్భం వ‌ల్ల తాను ఎక్కువ సేపు నిల్చుని పాట‌లు పాడ‌లేన‌ని ఆమె ముందుగానే నిర్వాహ‌కుల‌కు స‌మాచారం ఇచ్చారు కూడా. దానికి వారు అంగీక‌రించారు. క‌చేరీ సంద‌ర్భంగా ఆమె కూర్చుని పాట‌లు పాడారు.

పాట‌ల‌కు ముగ్ధులైన ప‌లువురు అభిమానులు ఆమెపై నోట్ల‌ను వెద‌జ‌ల్లారు. ఈ సంద‌ర్భంగా తారిఖ్ జ‌టోయ్ వ్య‌క్తి.. నిల్చుని పాట‌లు పాడాల‌ని, కూర్చుని పాడ‌టం సంప్ర‌దాయానికి విరుద్ధ‌మ‌ని వాదించాడు. స్థానికులు వారించ‌డంతో వెళ్లిపోయాడు.

ఆమె కొద్దిసేపు నిల్చుని పాటలు పాడే స‌మ‌యంలో.. వెన‌క్కి వ‌చ్చిన ఆ వ్య‌క్తి స‌మీనాపై కాల్పులు జ‌రిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జ‌రిపాడు. బుల్లెట్లు స‌మీనా శ‌రీరంలో దూసుకెళ్లింది. దీనితో ఆమె వేదిక మీదు కుప్ప‌కూలిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మీనా భ‌ర్త ఫిర్యాదు మేర‌కు స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. జ‌టోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here