ఇంజినీరింగ్ డ్రాపౌట్ బుర్ర ప‌క్క‌దారి ప‌ట్టింది..ఆ ప‌నిలో ఆరితేరాడు! `స్పెష‌ల్ కోడింగ్` కూడా!

హైద‌రాబాద్‌: అత‌ను ఇంజినీరింగ్ విద్యార్థి. అత‌ని తెలివి తేట‌లు చ‌దువుపై పెట్టి ఉంటే.. టాప్ రేంజ్‌కు చేరుకునే వాడు. ఏం చేద్దాం? అత‌ని బుర్ర ప‌క్క‌దారి ప‌ట్టింది. అక్ర‌మ మార్గానికి మ‌ళ్లింది. మ‌ధ్య‌లోనే చ‌దువు మానేశాడు. ఆ ప‌నిలో అత‌ను టాప్ ప్లేస్‌కు వ‌చ్చాడు.

డ్ర‌గ్స్‌, మ‌త్తు ప‌దార్థాలు, గంజాయి..వంటి మాద‌క ద్ర‌వ్యాల‌ను అమ్మ‌డం, వాటిని స‌ర‌ఫ‌రా చేయ‌డం.. ఆ విద్యార్థి ప‌ని. ఈ రంగంలో అత‌ను ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించాడు. చివ‌రికి- పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. ఆ విద్యార్థి పేరు బ‌చ్చు ర‌వికుమార్‌. ప్ర‌తిష్ఠాత్మ‌క జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ యూనివ‌ర్శిటీ విద్యార్థి.

 

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ర‌వికుమార్ 2013లో జెఎన్టీయూ-హెచ్‌లో సీఎస్ఈలో చేరాడు. చ‌దువుకునే రోజుల్లో త‌న స్నేహితుల‌తో క‌లిసి గోవాకు ట్రిప్ వేశాడు. అక్క‌డ అత‌నికి డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం అత‌ని జీవితాన్ని మ‌లుపు తిప్పింది. గోవా నుంచి తిరిగి వ‌చ్చిన ర‌వికుమార్ డ్ర‌గ్స్‌, గంజాయి స‌ర‌ఫ‌రా అక్ర‌మంగా గోవాకు త‌ర‌లించేవాడు.

విశాఖ‌ప‌ట్నం, ఖ‌మ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజానికి సేక‌రించేవాడు. కొకైన్‌, ఎల్ఎస్‌డీ, గంజాయిని య‌థేచ్ఛ‌గా తీసుకెళ్లేవాడు. వాట్స‌ప్ గ్రూప్‌ల ద్వారా ఆర్డ‌ర్‌ను స్వీక‌రించేవాడు.

కొకైన్‌, ఎల్ఎస్‌డీకి స్కోర్ అని, గంజాయికి గ్రీన్ అని కోడ్ వ‌ర్డ్స్ కూడా పెట్టాడు. హైద‌రాబాద్ ఎల్బీ న‌గ‌ర్ గంజాయిని విక్రయిస్తుండ‌గా రాచ‌కొండ స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అత‌ణ్ని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఏడు గ్రాముల కొకైన్‌, 10 ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, రెండు కేజీల గంజాయి, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here