పైకి జిమ్ సెంట‌ర్..లోన సెక్స్ రాకెట్‌!

భువ‌నేశ్వ‌ర్‌: ఇప్ప‌టిదాకా స్పా సెంట‌ర్లు, మ‌సాజ్ కేంద్రాల పేర్ల‌తో సెక్స్ రాకెట్ల‌ను న‌డిపించి సంద‌ర్భాల‌ను చాలా చూశాం. ఇది మాత్రం వాట‌న్నింటి క‌టే డిఫ‌రెంట్‌. ఏకంగా ఓ జిమ్ సెంట‌ర్‌లోనే సెక్స్ రాకెట్ న‌డిపారు కొంద‌రు వ్య‌క్తులు. ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడి చేసి, ఆ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని న‌యాగ‌ఢ్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. న‌యాగ‌ఢ్ కాలేజ్ రోడ్‌లో ఉన్న మార్కెట్ కాంప్లెక్స్‌లో ఫిట్‌నెస్ ప్లానెట్ అనే జిమ్ కొన‌సాగుతోంది.

అందులో వ్య‌భిచార కార్య‌క‌లాపాలు న‌డుస్తున్నట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో న‌యాగ‌ఢ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహ‌కుల‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. న‌లుగురు యువ‌తులు, న‌లుగురు విటుల‌ను అరెస్టు చేశారు. అనంత‌రం అమ్మాయిల‌కు కౌన్సెలింగ్ ఇచ్చి వ‌దిలి పెట్టారు. జిమ్‌ను సీజ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here