అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. ఎందుకో తెలుసా..?

తెలుగు యాంకర్, నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకో తెలుసా..? ఆమె కొడుకు ఫోన్ ను పగులగొట్టిందట.. అంతేకాకుండా వాళ్ళను తిట్టిందట.. దీంతో సదరు మహిళ అనసూయపై ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఇంతకూ ఏమి జరిగిందంటే హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతానికి అనసూయ వెళ్ళినప్పుడు తన తల్లితో పాటు ఓ బాలుడు అటుగా వెళ్తున్నాడు. అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లి, అభిమానంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. తమ మొబైల్ ద్వారా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా ఇది గమనించిన అనసూయ ఆగ్రహంతో బాలుడి చేతిలోని ఫోన్ ను లాక్కుని, నేలకేసి కొట్టింది. ఫోన్ ఎందుకు పగలగొట్టావని అడగడంతో సమాధానం చెప్పకుండా వారిని తిడుతూ అనసూయ అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఆ మహిళ ఇక చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సెలెబ్రిటీలు అన్నాక సవా లక్షా టెన్షన్లు వారికి ఉంటాయి. ఆ కుర్రాడు అనసూయ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడికి ఏ పని మీద వచ్చిందో.. ఎప్పుడు చూడూ సెల్ఫీలు.. సెల్ఫీలు అని అందరూ చుట్టూ మూగుతుంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పండి. కనీసం మన వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోరు ఫోటోలు తీసుకోడానికి.. మేడమ్ ఇదిగో.. ఇదిగో.. అంటూ మీద పడిపోయిన సందర్భాలను చాలా చూసే ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here