పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం..!

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కొన్ని మీడియా సంస్థల అధినేతలపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా కామెంట్లు చేస్తూ ఉన్నారు. పవన్ టార్గెట్ చేసిన మీడియా సంస్థల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఉంది. అయితే దీనిపై ఆ సంస్థల యాజమాన్యం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. సామాజిక మాధ్యమాల్లో ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ల పై తప్పుడు ప్రచారం చేస్తున్నాని పవన్ కళ్యాణ్, ఆయన అనుచరులపై సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులో నమోదైంది.

తప్పుడు ప్రచారంతో పాటు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ ఫిర్యాదు చేసింది. మీడియాపై పవన్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. అలాగే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా పవన్ ను క్షమాపణలు చెప్పాలని నోటీసులు పంపారు.

తన సంస్థపై ఊహాజనితంగా చేసిన ఆరోపణలను, ట్వీట్లను బేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. పవన్ ఆరోపిస్తున్నట్టు తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవన్నారు. పవన్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here