శ్రీరెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు..!

తనకు జరిగిన అన్యాయంపై ప్రస్తుతం శ్రీరెడ్డి చిన్నపాటి యుద్ధమే చేస్తోంది. సోషల్ మీడియాలో తన లాంటి ఎంతో మందిని మోసం చేసిన వారిని బయటపెడుతూ వస్తోంది. టీవీ ఛానల్స్ కు కొద్దిరోజులు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం లీకులు చేస్తూనే ఉంది. తాను 3 సినిమాల్లో నటించానని అయినప్పటికీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్డు రాలేదని చెప్పుకొచ్చింది. తనను తొక్కేయాలని చాలా మంది అనుకుంటున్నారని అయినా కూడా భయపడేది లేదని చెప్పింది. తాజాగా శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి పవన్‌ కల్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. ప్రసార మాధ్యమాల్లో ఆమె ఇష్టానుసారం మాట్లాడుతూ టాలీవుడ్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు, దానిని న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు దానిపై చర్యలు తీసుకోనున్నారు. శ్రీ రెడ్డి ఇప్పటికే ప్రముఖ దర్శకులను, టీవీ ఛానల్ ప్రోగ్రాం హెడ్ నూ టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు గుప్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here