మైన‌ర్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను త‌ల్లిని చేశాడు..అబార్ష‌న్ చేయించ‌డానికి తీసుకెళ్లి క్లినిక్‌లో దొరికాడు!

త‌న‌తో చ‌నువుగా ఉంటున్న ఓ స్నేహితురాలిని త‌ల్లిని చేశాడో బాలుడు. ఇద్ద‌రూ మైన‌ర్లే. గ‌ర్భం దాల్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను అబార్ష‌న్ చేయించ‌డానికి క్లినిక్‌కు తీసుకెళ్లాడు. డాక్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక తెల్ల‌మొహం వేశాడు. దీనితో డాక్ట‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ బోర‌బండ‌లో చోటు చేసుకుంది. బాధితురాలు, ఆమె స్నేహితుడూ ఇద్ద‌రూ 16 సంవ‌త్స‌రాల లోపు వారే. దీనితో నిందితుడిని పోలీసులు జువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించారు.

బోరబండ బాబా సైలానీనగర్‌లో నివాసం ఉండే బాధిత బాలిక స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తిలో చ‌దువుతోంది. బాలుడు కూడా అదే ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు. బాబా షైలానీ న‌గ‌ర్‌కే చెందిన వాడు కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది. బాలుడు మ‌ధ్య‌లోనే బ‌డి మానివేశాడు. ఏడాదిగా వారిద్ద‌రూ స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్నారు.

 

దీనితో ఇద్ద‌రి మ‌ధ్యా శారీర‌క సంబంధం ఏర్ప‌డింది. బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక అతడికి చెప్పి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. దీనికి మొద‌ట అంగీక‌రించిన అత‌ను.. అబార్ష‌న్ చేయిస్తాన‌ని అన్నాడు. బాలిక‌ను తీసుకుని మూసాపేట్‌లోని ఓ క్లినిక్‌కు వెళ్లాడు. అబార్షన్ చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. క్లినిక్ సిబ్బంది, డాక్ట‌ర్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేక‌పోయాడు.

 

దీనితో వారికి అనుమానం వ‌చ్చింది. వెంట‌నే- ఎస్సార్‌న‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు బాలుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత బాలికను భరోసా కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here