స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకోవ‌డానికి వ‌చ్చిన విద్యార్థినుల‌పై టీచ‌ర్ ఘాతుకం..

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో మ‌రో దుర్మార్గ‌పు ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రు పాఠ‌శాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేశాడు. వారి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. పాఠ‌శాల‌లో త‌న ఛాంబ‌ర్‌లోనే అత‌ను ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. పూరి జిల్లాలోని కాక‌ట్‌పురా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న సునారిబ‌స్తా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే వారి త‌ల్లిదండ్రులు, స్థానికులు అత‌నిపై దాడి చేశారు. దేహ‌శుద్ధి చేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. నిందితుడి పేరు మాన‌స్ మిశ్రా. సునారిబ‌స్త ప్రాజెక్ట్ ప్రైమ‌రీ స్కూల్ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నాడు. సోమ‌వారం సాయంత్రం ఆడుకోవ‌డానికి పాఠ‌శాల‌కు వ‌చ్చిన 4, 5వ త‌ర‌గ‌తి విద్యార్థినుల‌ను త‌న గ‌దిలోకి పిలిపించుకుని ఆకృత్యానికి పాల్ప‌డ్డాడు.

దీన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన స్థానికులు వెంట‌నే ఆ గ‌దికి బ‌య‌టి వైపు నుంచి గొళ్లెం పెట్టారు. విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే స్కూల్ వ‌ద్ద‌కు చేరుకున్న త‌ల్లిదండ్రులు స్థానిక గ్రామ‌స్థులు మాన‌స్ మిశ్రాకు దేహ‌శుద్ధి చేసి, పోలీసుల‌కు అప్ప‌గించారు. కాక‌ట్‌పుర పోలీసులు నిందితునిపై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. కేసు న‌మోదు చేసిన వెంట‌నే విద్యాశాఖాధికారులు అత‌ణ్ని స‌స్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here