త‌న గర్ల్‌ఫ్రెండ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని ఆమె స్నేహితుడిని..!

త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నాడ‌నే కార‌ణంతో ఆమె స్నేహితుడిపై దాడి చేశాడో యువ‌కుడు. అత‌ని పేరు రాకేశ్‌. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేట‌ర్ కుమారుడత‌ను. ఈ దాడిలో క‌త్తిపోట్ల‌కు గురైన యువ‌కుడు.. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరెలో చోటు చేసుకుంది.

రాకేశ్ కొంత‌కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అత‌ణ్ని ప్రేమిస్తోంది. త‌న ప్రియురాలితో హ‌రీష్ అనే యువ‌కుడు సన్నిహితంగా ఉంటున్నాడ‌ని గుర్తించాడు. బుధ‌వారం ఉద‌యం అత‌నిపై క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హ‌రీష్ క‌త్తిపోట్ల‌కు గుర‌య్యాడు. వెంట‌నే అత‌ణ్ని దావ‌ణ‌గెరె ఆసుప‌త్ర‌కి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేటీజే న‌గ‌ర పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. రాకేశ్ తండ్రి లింగ‌రాజు కార్పొరేట‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here