మ‌హిళ‌కు అక్ర‌మ సంబంధాన్ని అంట‌గ‌ట్టారు! వివ‌స్త్ర‌ను చేశారు!

ఓ మహిళ కురులను కత్తిరించి, వివస్త్రను చేసి, ఊరంతా తిప్పిన అమానుష ఘటన ఒడిశాలోని బాల‌న్‌గిర్‌ జిల్లా లోయిసింగ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. కొరెకొచియా గ్రామానికి చెందిన ఓ మ‌హిళ‌కు అదే గ్రామానికి చెందిన కొంద‌రు వ్య‌క్తుల‌తో అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డ‌మే దీనికి కార‌ణం.

త‌మ కాపురాల‌ను కూల్చ‌తోంద‌ని కొంద‌రు మ‌హిళ‌లు ఈ విష‌యాన్ని గ్రామ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆ మ‌హిళపై చ‌ర్య‌లు తీసుకోలేమ‌ని గ్రామ పెద్ద‌లు తేల్చి చెప్పారు. దీనితో ఆగ్ర‌హానికి గురైన ఆ మ‌హిళ‌లు, కొంద‌రు వ్యక్తులు క‌లిసి బాధిత మ‌హిళ ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో దాడి చేశారు. ఆమె జుట్టు క‌త్తిరించారు. కురులు కత్తిరించారు. ఆమెపై దాడికి పాల్పడి వివస్త్రను చేశారు. తర్వాత ఇంటికి చేరుకున్న బాధిత మహిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి లోయిసింగా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

దాడి జరిగి వారం రోజులైనా ఫిర్యాదుపై పోలీసులు స్పందించపోవడంతో సోమవారం ఆమె విలేకరులను ఆశ్రయించింది. దీనిపై విలేకరులు పోలీసులను ప్రశ్నించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here