న‌దిలో తేలిన‌ లెస్బియ‌న్ల మృత‌దేహాలు! ఈ స‌మాజంలో బ‌త‌క‌లేమంటూ లేఖ!

ఓ లెస్బియన్ జంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం ఇది. ఈ స‌మాజం త‌మ‌ను బ‌త‌క‌నివ్వ‌ట్లేద‌ని ఆత్మ‌హ‌త్య లేఖ రాసి, వారు న‌దిలో దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఆ ఇద్ద‌రు లెస్బియ‌న్ల‌తో పాటు ఓ మూడేళ్ల చిన్నారిని తీసుకుని న‌దిలో దూకారు. మృతుల పేర్లు ఆశా, భావ‌న‌. వారిని గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌ బావ్లా పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు.

ఆశా, భావ‌న ఇద్ద‌రూ ఓ వ‌స్త్రాల త‌యారీ కంపెనీలో ప‌ని చేస్తుండేవారు. ఇద్ద‌రూ వారి భ‌ర్త‌ల‌కు దూరంగా త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఒకే చోట క‌లిసి ప‌నిచేస్తుండ‌టంతో ఆశా, భావ‌న మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. అది కాస్తా స్వ‌లింగ సంప‌ర్కానికి దారి తీసింది. ఏడెనిమిది నెల‌లుగా వారు ఒకే ఇంట్లో నివ‌సించే వారు. పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు.

ఈ విష‌యం తెలిసిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఇంటిపై దాడి చేశారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆశా, భావ‌న ఆ ప్రాంతం వ‌దిలి వెళ్లారు. ఆ స‌మయంలో వారి వెంట ఆశా కుమార్తె మేఘ‌న కూడా ఉంది. అలా ఊరొదిలి వెళ్లిన ఆ ముగ్గురూ స‌బ‌ర్మ‌తీ న‌దిలో మృత‌దేహాలై తేలారు. మృత‌దేహాల‌ను గుర్తించిన స్థానికులు గుజారీ బజార్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా, మరో మృత‌దేహంతో పాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. త‌మ‌కు మ‌గ‌తోడు లేద‌ని, ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌య్యామ‌ని, ఈ సమాజం ఒక్కటిగా బతకనివ్వట్లేదని లేఖ రాశారు. అందుకే కలిసి చావాలనుకుంటున్నామంటూ ఆత్మ‌హ‌త్య లేఖ రాశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here