ఉన్మాదం! 65 ఏళ్ల వృద్ధురాలిపై తాత‌, తండ్రి, కొడుకు గ్యాంగ్‌రేప్!

‘మా అమ్మాయిని తీసుకెళతారా.. ఆ బాధ ఎలా ఉంటుందో అంతకంత అనుభవించి తీరాలి’ అనే ఉన్మాద ఆలోచన ఆ కుటుంబాన్ని పశువుల్లా మార్చింది.. కామంతో కళ్లు మూసుకుపోయాయి. వావి వరసలు మరిచారు. త‌మ కుమార్తెను ఎత్తుకెళ్లిన యువ‌కుడి త‌ల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

గ్యాంగ్‌రేప్‌న‌కు గురైన ఆ త‌ల్లి వ‌య‌స్సు 65 సంవ‌త్స‌రాలు. ఆమెపై అత్యాచారం చేసిన కిరాత‌కులు తాత, తండ్రి, కొడుకు. త‌మ కుమార్తె దొరికేంత వ‌ర‌కూ ఆ వృద్ధురాలిని వ‌దిలి పెట్టేది లేద‌ని అంటూ ఇంట్లోనే బంధించారు. మూడురోజుల పాటు అత్యాచారం చేశారు. వృద్ధురాలికి నరకం చూపించారు. ఎలాగో తప్పించుకున్న ఆ వృద్ధురాలు తిరుప‌తి అర్బన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

చిత్తూరు జిల్లా రేణిగుంట మండ‌లంలో ఈ అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రేణిగుంట మండ‌లం నక్కలకాలనీలో నివాసం ఉంటున్న 65 సంవత్సరాల వృద్ధురాలికి అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వృద్ధురాలు కుమార్తెతో కలిసి…రేణిగుంట రైల్వేస్టేషన్‌లో పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఆమె నాలుగో కుమారుడు వెంకటేష్ త‌మిళ‌నాడులోని తిరుత్తణిలో నివ‌సిస్తోన్న స‌మీప బంధువు శంకర్‌ కుమార్తెను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి శంక‌ర్ ఇంట్లో ఎవ‌రికీ ఇష్టం లేదు. దీనితో వెంక‌టేష్ ఆ యువ‌తిని ఒంగోలుకు తీసుకెళ్లాడు. అక్క‌డ త‌న స్నేహితుల సమ‌క్షంలో పెళ్లి చేసుకుని, రేణిగుంట‌కు చేరుకున్నాడు.

తన కుమార్తె కనబడడం లేదని, దీనికి కార‌ణం వెంక‌టేషే అనే అనుమానంతో శంకర్‌, అతని తండ్రి యాదగిరి, కుమారుడు శరత్‌ మూడు రోజుల కింద‌ట తిరుత్త‌ణి నుంచి రేణిగుంటకు వ‌చ్చారు. వెంక‌టేష్ త‌ల్లి, 65 సంవ‌త్స‌రాల వృద్ధురాలిపై దాడిచేశారు. ఆమెను త‌మ వెంట బ‌ల‌వంతంగా కారులో తిరుత్తణికి తీసుకెళ్లారు. తిరుత్తణిలోని ఓ ఇంటిలో కట్టేసి శంకర్‌, యాదగిరి, శరత్‌లు ముగ్గురూ కలిసి మూడు రోజుల పాటు వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఎట్టకేలకు సోమవారం ఉదయం ఆమె అక్కడనుంచి తప్పించుకుని రేణిగుంటలోని కుటుంబ సభ్యులను క‌లిశారు. బాధితురాలు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం తిరుపతి అర్బన్‌ ఎస్‌పిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివ‌రించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here