14 ఏళ్ల బాలిక‌పై ఆమె ఇంట్లోనే ఘాతుకం!..పెట్రోలు పోసి!

రాంచీ: జార్ఖండ్‌లో కిరాత‌క ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 14 సంవ‌త్స‌రాల మైన‌ర్ బాలిక‌పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ఆమె ఇంట్లో, కుటుంబ స‌భ్యుల క‌ళ్లెదుటే అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం- పెట్రోలు పోసి త‌గుల‌బెట్టారు. సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రాజ‌ధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలో ఇట్ఖోరి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న రాజ్‌ తెందువా గ్రామంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన నలుగురు యువకులు ఇంట్లోంచి త‌మ కుమార్తెను అపహరించుకుని వెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విష‌యాన్ని మృతురాలి త‌ల్లిదండ్రులు రాజ్‌తెందువా గ్రామ పెద్ద‌ల‌కు తెలియ‌జేశారు. దీనితో వారు పంచాయితీ పెట్టి.. నిందితుల‌పై 50 వేల జ‌రిమానా విధించారు. గుంజీలు తీయించారు. దీన్ని మ‌న‌సులో పెట్టుకున్న నిందితులు మ‌రోమారు ఆమె ఇంటిపై దాడి చేశారు. పంచాయితీ పెట్టి, త‌మ ప‌రువును తీసింద‌నే ఆగ్ర‌హంతో బాలిక‌ను స‌జీవ ద‌హ‌నం చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై ఇట్ఖోరి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here