బి`హార‌ర్`: ప‌ట్ట‌ప‌గ‌లు బాలిక‌పై ఏడుమంది యువ‌కులు లైంగిక దాడి!

పాట్నా: బిహార్‌లో ఆట‌విక రాజ్యం నెల‌కొంద‌న‌డానికి ఇంత‌కంటే సాక్ష్యాలు అవ‌స‌రం లేద‌నిపించే ఘ‌ట‌న ఇది. ప‌ట్ట‌ప‌గ‌లు ఓ బాలిక‌పై ఏడుమంది యువ‌కులు లైంగిక దాడి చేశారు. సామూహికంగా ఆ బాలిక‌ను చుట్టుముట్టారు. కింద ప‌డేసి, బ‌ట్ట‌లు ఊడ‌దీశారు. ఆ బాలిక ఏడుస్తున్నా, కాళ్ల మీద ప‌డి వేడుకుంటున్నా క‌నిక‌రించ‌లేదా కీచ‌కులు.

`భ‌య్యా` అని కాళ్ల మీద ప‌డుతున్నా వ‌ద‌ల్లేదా దుర్మార్గులు. ఒకేసారి ఏడుమంది చుట్టుముట్ట‌డంతో భీతిల్లిపోయిన ఆ బాలిక చివ‌రికి.. స్పృహ కోల్పోయింది. ఈ దారుణ ఘ‌ట‌న‌ను వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. త‌మ కంట్లో ప‌డ‌టంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ఈ కిరాత‌కుల‌ను వెదికే ప‌నిలో ప‌డ్డారు. బిహార్‌లోని జెహ‌నాబాద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని ఏ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌నేది ఇంకా తెలియ‌రాలేదు. ఈ వీడియో తమ దృష్టికి వ‌చ్చింద‌ని, దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు జెహ‌నాబాద్ ఎస్పీ తెలిపారు. ఆ స‌మ‌యంలో బాలిక ఒంట‌రిగా ఉన్న‌ట్టు తేలింద‌ని పోలీసులు చెబుతున్నారు. ఒంట‌రిగా త‌న ఇంటికి వెళ్తుండ‌గా.. కాపు గాచిన ఏడుమంది ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు గుర్తించామ‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here