ఆ వీడియోల్లో భార్య‌ను చూసి..ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త

మంచిర్యాల‌: పెళ్లికి ముందే త‌న ప్రియుడితో సాగించిన రాస‌లీల‌ల‌ను గుట్టుగా దాచుకోలేదా భార్య‌. త‌న‌ను పెళ్లి చేసుకున్నాడ‌నే క‌సితో ర‌గిలిపోయిన ఆమె.. ఆ రాస‌లీల‌ల వీడియోల‌ను ఏకంగా భ‌ర్త‌కు వాట్స‌ప్ ద్వారా పంపించింది. భ‌ర్త‌కు మాత్ర‌మే కాదు..అత‌ని కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల‌కూ పంపించింది.

దీని ఫ‌లితం.. అవ‌మాన భారాన్ని త‌ట్టుకోలేక, మ‌న‌స్తాపానికి గురైన ఆ భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దండేపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ధర్మరాజుకు గ‌త ఏడాది మార్చిలో జగిత్యాల జిల్లా కన్నాపూర్‌ గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది.

నాగ‌లక్ష్మికి పెళ్లికి ముందే అక్ర‌మ సంబంధం ఉంది. వెల్గటూర్‌కు చెందిన మహేష్ అనే యువ‌కుడిని ఆమె ప్రేమించింది. వారిద్ద‌రి మ‌ధ్యా శారీర‌క సంబంధం కూడా ఉంది. ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో నాగ‌ల‌క్ష్మి త‌ల్లిదండ్రులు ఆమెను ధ‌ర్మ‌రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి త‌రువాత కూడా నాగ‌ల‌క్ష్మి త‌న ప్రియుడిని మ‌రిచిపోలేక‌పోయింది.

అత‌నితో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించింది. అక్క‌డితో ఆగ‌లేదామె. అత‌ణ్ణి ముద్దాడుతున‌న వీడియో, ఇత‌ర అసభ్యకరమైన వీడియోలు, ఫొటోల‌ను వారిద్ద‌రూ క‌లిసి ధర్మరాజు ఫోన్‌కు వాట్సాప్‌లో పంపించారు. అప్ప‌టికీ ఆమె క‌సి చ‌ల్లార‌లేదేమో!

ధ‌ర్మ‌రాజు క‌ట్టిన తాళిని తీసి వేసి, ప్రియుడు మహేష్‌తో తాళి కట్టించుకున్న వీడియోను కూడా ఆమె ధ‌ర్మ‌రాజుకు పంపించింది. ధర్మరాజుకు మాత్ర‌మే కాకుండా అత‌ని బంధువులు, స్నేహితుల‌కు కూడా పంపించారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మరాజు పొలం వద్ద పురుగుల మందు తాగి, ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు.

స‌కాలంలో అత‌ణ్ణి గుర్తించిన కుటుంబీకులు ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి సోదరుడు సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి బాధ్యులైన భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడి మంత్రి మహేష్‌పై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here