ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువకుడు ఓ ముస్లిం. తాను హిందువునని నమ్మించాడు. ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. హిందువుగా చలామణి అవుతూ.. అదే మతానికి చెందిన యువతిని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తరువాత అసలు విషయం బహిర్గతం కావడంతో.. అతని భార్య చీపురుకట్ట తిరగేసింది. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేసింది.
ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు మహ్మద్ సయ్యద్. జిల్లాలోని సుళ్య గ్రామానికి చెందిన సయ్యద్ తన పేరును అరుణ్ పూజారిగా మార్చుకున్నాడు. అదే పేరుతో తూక్కూట్టు శివార్లోని కుంపల గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు.
ఈ నేపథ్యంలో అతనికి మంగళూరులో ఓ షాపింగ్ మాల్లో పనిచేసే యువతితో పరిచయమైంది. అరుణ్ పూజారి పేరుతోనే అతను ఆ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. రెండేళ్ల కిందట ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. క్రమంగా- అరున్ పూజారి ప్రవర్తనపై ఆమెకు అనుమానం తలెత్తింది.
ఆరు నెలల కిందట అసలు విషయం తేలింది. అతని పేరు అరుణ్ పూజారి కాదని, సయ్యద్ అతని తెలిసింది. దీనితో ఆరు నెలలుగా వారిద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరుగుతోంది. గురువారం సయ్యద్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీనితో- ఆమె ఎదురు తిరిగింది. నాలుగు తన్నులు తన్ని, ఉల్లాల పోలీసులకు పట్టిచ్చింది.