మగ పోలీసులు బీచ్ లో పడుకున్న యువతిపై ఇలా పిడిగుద్దుల వర్షం..!

పెన్సిల్వేనియా మహిళ న్యూజెర్సీ పర్యటనకు వచ్చి చివరికి చేతులకు బేడీల దాకా వెళ్ళింది. బీచ్ లో సేదతీరుతున్న ఆ మహిళను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు పోలీసులు. అయితే అది కాస్తా హింసాత్మకంగా మారిపోయింది. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా ఇప్పటివరకూ 6.2మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అందులో ముగ్గురు వైల్డ్ వుడ్ పోలీసులు ఫిలడెల్ఫియాకు చెందిన 20 ఏళ్ల ఎమిలీ వీన్మన్ ను అదుపులోకి తీసుకుంటూ ఉండగా ఆమె ప్రతిఘటించడం.. ఇంతలో పోలీసులు ఆమె మీద పిడిగుద్దులు కురిపించడం వెంటవెంటనే జరిగిపోయాయి. పోలీసులు మరీ ఇంత కఠినంగా ప్రవర్తిస్తారా అమ్మాయిల పట్ల అని అనిపిస్తోంది.


ఎమిలీ వీన్మన్ ప్రతిఘటిస్తుంటే, ఓ అధికారి కాళ్లను గట్టిగా పట్టుకోగా, మరో అధికారి తలపై కనీసం రెండు సార్లు కొడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. తానేమీ తప్పు చేయలేదని ఆమె ఏడుస్తుండగా, చుట్టూ ఉన్నవారు “పోలీసులకు ఎదురు తిరగవద్దు… చెప్పినట్టు చెయ్యి” అని ఆమెకు సలహా ఇస్తుండటం కూడా వినిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీసిన లెక్సీ దీన్ని ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, గంటల వ్యవధిలో 46 వేల షేర్లను తెచ్చుకుంది. బీచ్ లో మద్యం సేవిస్తూ గడుపుతున్న మైనర్లను నిలువరించేందుకు వచ్చిన పోలీసులు ఆమెను అనుమానించారని ‘ఎన్ జే డాట్ కామ్’ వెల్లడించింది. పోలీసులకు ఆమె సహకరించలేదని, అందువల్లే పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారని తెలిపింది.

ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిపగా.. ఆమె మద్యం తాగలేదని తేలింది. ఆమెపై పోలీసు మీద ఉమ్మి వేయడం, బహిరంగ నిరసన తెలపడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలను మోపారు. మెమోరియల్ డే చూడడానికి వచ్చిన తనకు ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన ఘటన అని ఎమిలీ తెలిపింది. తాను ఎటువంటి తప్పూ చేయలేదని.. తన మీద ఉన్న పోలీసును వెనక్కు తోయడానికి ప్రయత్నించాను తప్పితే మరేదీ చేయలేదని చెప్పింది ఎమిలీ..!

Image result for Emily Weinman

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here