చిన్న‌ప్ప‌టి నుంచి ఆడుకున్న చెరువులోనే..ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌!

రామ‌న‌గ‌ర‌: సెల‌వుల్లో స‌ర‌దాగా గ‌డ‌ప‌డానికి త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి సొంతూరికి వెళ్లిన ఓ గృహిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఆడుకుంటూ పెరిగిన చెరువులోనే దూకి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర జిల్లా మాగ‌డి తాలూకాలోని క‌ల్కెరె గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

క‌ల్కెరె గ్రామానికి చెందిన సుజాత‌కు ఎనిమిదేళ్ల కింద‌ట అంజ‌నామూర్తితో వివాహ‌మైంది. పెళ్లయిన త‌రువాత వారు బెంగళూరు ద‌క్షిణ తాలూకా ప‌రిధిలోని ముద్ద‌య్య‌నపాళ్య‌లో నివాసం ఉండ‌సాగారు. వారికి ఇద్ద‌రు కుమారులు. విశాల్, న‌కుల్‌.

శుక్ర‌వారం త‌న పుట్టింటికి వెళ్లిన సుజాత‌.. మ‌రుస‌టి రోజు సాయంత్రం చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచీ ఆడుకుంటూ పెరిగిన చెరువు అది. సుజాత ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేదు. ఆదివారం ఉద‌యం పోలీసులు వారి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మాగ‌డి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here