ఎక్క‌డో చంపి, అక్క‌డికి తీసుకొచ్చి!

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు దారుణ‌హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోస్గి ప‌ట్ట‌ణం శివార్ల‌లోని పాత‌ర్ల‌గ‌డ్డ వ‌ద్ద అత‌ని మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు. హ‌తుడు ఎవ‌ర‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుడు కాద‌ని అంటున్నారు. ఎక్క‌డో చంపి, అక్క‌డికి తెచ్చి ప‌డేసి ఉంటార‌ని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here