సిటీబ‌స్సులో యువ‌తి కాలు మీద కాలు వేసి..ప్యాంటు జిప్పు విప్పి..!

బెంగ‌ళూరు: బెంగ‌ళూరులో రాత్రిపూట సిటీ బ‌స్సు ఎక్కిన ఓ యువ‌తి లైంగిక వేధింపుల‌కు గుర‌య్యారు. బ‌స్సులో పెద్ద‌గా ప్ర‌యాణికులు లేక‌పోవ‌డాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న 65 సంవ‌త్స‌రాల ఓ వృద్ధుడు హేయ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. తాను కూర్చున్న సీటు వ‌ద్ద నిల్చుని, మొద‌ట ఆ యువ‌తి కాలు మీద కాలు వేశాడు.

 

వృద్ధుడు కావ‌డంతో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదా యువ‌తి. దీనితో త‌న ప్యాంటు జిప్ విప్పాడు. చివ‌రికి బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బెంగ‌ళూరు కోర‌మంగ‌ళ 100 ఫీట్స్ రోడ్‌లోని ఇజోన్ వ‌ద్ద ఈ నెల 13వ తేదీన రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో బీఎంటీసీ సిటీ బ‌స్సెక్కారు బాధిత యువ‌తి. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.

త‌రువాతి స్టేజీలో 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ వృద్ధుడు బ‌స్ ఎక్కాడు. బాధిత యువ‌తి కూర్చ‌న్న సీటు వ‌ద్ద వ‌చ్చి నిల్చున్నాడు. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం కేటాయించిన‌ సీటు ఖాళీగా ఉంద‌ని, కూర్చోవాల‌ని ఆమె సూచించింది. తాను ఇంకా సీనియ‌ర్ సిటిజ‌న్ కాద‌ని, యంగ్‌గా ఉన్నాన‌ని ఎద్దేవా చేశాడు.

ఆమె భుజానికి ఆనుకుని నిల్చున్నాడు. ఆమె కాలు మీద కాలు వేశాడు. ప్యాంట్ జిప్పు విప్ప‌దీశాడు. దీనితో ఆగ్ర‌హించిన ఆమె అక్క‌డిక‌క్క‌డే ఆ వృద్ధున్ని నిల‌దీశారు. గ‌ట్టిగా కేక‌లు వేశారు. కండ‌క్ట‌ర్‌కు వివ‌రించారు. దీనితో కండ‌క్ట‌ర్ కోర‌మంగ‌ళ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here