బావ‌ను ప్రేమ వివాహం చేసుకున్న బాలిక‌ను హ‌త్య చేసిందెవ‌రంటే..?

క‌ర్నూలు: క‌ర్నూలు జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఓ బాలిక హ‌త్య‌కు గురైంది. త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబీకులే ఆమెను హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ మండ‌లం కోట‌కందుకూరులో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు ల‌క్ష్మీదేవి. 17 సంవ‌త్స‌రాలు అదే గ్రామానికి చెందిన చాకలి నాగేంద్ర‌ను ఆమె ప్రేమించింది.

 

నాగేంద్ర ఆమెకు స్వ‌యానా బావ‌. ఏడాదికాలంగా వారి ప్రేమ వ్య‌వ‌హారం సాగుతోంది. ఈ విష‌యం ఇంట్లో తెలిసిన త‌రువాత.. వారి పెళ్లికి పెద్దలు నిరాక‌రించారు. దీనితో ప‌దిరోజుల కింద‌ట ల‌క్ష్మీదేవి, నాగేంద్ర ఇంట్లో నుంచి పారిపోయి, గుడిలో పెళ్లి చేసుకున్నారు. ల‌క్ష్మీదేవి మైనర్ కావ‌డంతో కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కొత్త దంప‌తుల‌ను స్టేష‌న్‌కు పిలిపించారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మైనర్‌ని పెళ్లాడ‌టం నేర‌మ‌ని నాగేంద్ర‌ను హెచ్చ‌రించారు. మేజర్‌ కాగానే అందరి సమక్షంలో ఘనంగా వివాహం చేస్తామని పోలీసులే హామీ ఇచ్చారు. దీనితో లక్ష్మీదేవి శనివారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లింది.

అలా వెళ్లిన కొన్ని గంట‌ల్లోనే ఆమె దారుణ‌హ‌త్య‌కు గురైంది. మంగళవారం తెల్లవారుజామున న‌ది ఒడ్డున ఆమె మృత‌దేహ‌మై క‌నిపించింది.

చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఆమె త‌ల్లిదండ్రులు మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ కుమార్తె ఉరివేసుకున్నట్లు లక్ష్మీదేవి తల్లిదండ్రులు చెబుతున్నారు.

మృత‌దేహంపై అలాంటి ఆనవాళ్లు లేకపోగా నుదిటికి గాయం ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు లక్ష్మీదేవి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here