మొద‌ట క‌ర్ర‌ల‌తో దాడి చేసి..ఆపై వేట కొడ‌వ‌లితో న‌రికి!

జగిత్యాల‌: వివాహేత‌ర సంబంధం ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి ప్రాణాల‌ను హ‌రించి వేసింది. త‌న కుమార్తెతో వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకున్నాడ‌నే క‌క్ష‌తో ఓ వ్య‌క్తి దారి కాచి..దారుణ‌హ‌త్య చేశాడు. తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హ‌తుడి పేరు సురేష్‌. జిల్లా రెవిన్యూశాఖ‌లో ఉద్యోగి. అత‌నికి భార్య‌, కుమార్తె ఉన్నారు.

జిల్లాలోని మేడిప‌ల్లి మండ‌లం తొంబ‌ర్రావు పేట్‌కు చెందిన సురేష్‌.. కొంత‌కాలంగా ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం తెలియ‌డంతో ఆ మ‌హిళ తండ్రి ప‌లుమార్లు సురేష్‌ను హెచ్చ‌రించాడు. అయిన‌ప్ప‌టికీ.. అత‌ను ఏ మాత్రం వినిపించుకోలేదు.

త‌న కుమార్తెకు మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నాడ‌ని ఆరోపిస్తూ మహిళ తండ్రి గంగారెడ్డి, సోదరుడు సంతోష్‌రెడ్డి ఈ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారు. గురువారం సాయంత్రం తొంబ‌ర్రావు పేట్ శివార్ల‌లో కాపు గాశారు. విధుల‌ను ముగించుకుని సురేష్ త‌న స్నేహితుడితో క‌లిసి బైక్‌పై వ‌స్తుండ‌గా అడ్డ‌గించారు.

మొదట కర్రలతో దాడిచేయగా స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడవలితో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. దీంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితులిద్ద‌రూ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయారు. త‌న కుమార్తెను వేధిస్తున్నందుకే హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here