మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం వేసిన పైప్‌లైన్‌లో..కొన్ని గంట‌ల పాటు!

హ‌వేరి: పైప్‌లైన్‌లోకి వెళ్లి, అక్క‌డే చిక్కుకుని, బ‌య‌టికి రాలేక కేక‌లు పెడుతోన్న ఓ మ‌హిళను ర‌క్షించ‌డానికి జిల్లా పాల‌నాయంత్రాంగం మొత్తం క‌దిలి వ‌చ్చింది. కొన్ని గంట‌ల పాటు చెమ‌టోడ్చి, 15 అడుగుల మేర గొయ్యి త‌ప్పి, పైపుల‌ను క‌త్తిరించి ఆమెను ర‌క్షించారు అధికారులు. క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలోని స‌వ‌ణూరు ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ మ‌హిళ పేరు గౌర‌మ్మ‌. 36 సంవ‌త్స‌రాల గౌర‌మ్మకు కొద్దిరోజులుగా మానిసిక స్థితి స‌రిగ్గా ఉండ‌ట్లేదు. మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం కొత్త‌గా వేసిన పైప్‌లైన్‌లోకి వెళ్లి అక్క‌డే చిక్కుకుపోయారు. బ‌య‌టికి రాలేక, కేక‌లు వేశారు. ఆ కేక‌లు విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారులు కొన్ని గంట‌ల పాటు శ్ర‌మించారు.

15 అడుగుల మేర గొయ్యి త‌వ్వి, వెల్డింగ్ ద్వారా పైపుల‌ను క‌త్తిరించి గౌర‌మ్మ‌ను వెలికి తీశారు. వెంట‌నే ఆమెను తాలూకా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కొన్ని గంట‌ల పాటు ఆహారం, మంచినీరు, స‌రైన గాలి, వెలుతురు లేకుండా పైప్‌లైన్‌లో గ‌డ‌ప‌డం వ‌ల్ల అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here