హిజ్రానూ వ‌ద‌ల్లేదు: గ‌్యాంగ్‌రేప్‌..చిత్ర‌హింస‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ హిజ్రాను అప‌హ‌రించి, గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డారు. మూడురోజుల పాటు నిర్బంధించి, చిత్ర‌హింస‌లు పెట్టారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖ‌నెవ‌ల్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌ర్నీ అరెస్టు చేసిన‌ట్టు ఖ‌నెవల్ సిటీ పోలీసులు తెలిపారు.

నైనా అనే హిజ్రాను అద్నాన్‌, ద‌ట్టో అనే యువ‌కులు అప‌హ‌రించి, సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్టు నిర్ధారించామ‌ని అన్నారు. ఓ హిజ్రాను కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లార‌ని, అక్క‌డ చిత్ర‌హింస పెట్టార‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.

ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక హిజ్రాలు పెద్ద సంఖ్య‌లో ఫామ్‌హౌస్‌కు వెళ్లి.. నైనాను విడిపించారని అన్నారు. త‌మ ప‌ట్ల క‌నీస మాన‌వత్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, త‌మ సామాజిక వ‌ర్గంపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయ‌ని హిజ్రాల కోసం ఏర్పాటైన స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here