ఇద్ద‌రు మ‌హిళ‌లు..ఓ పురుషుడు! మెడ‌లో చెప్పుల‌దండ వేసి ఊరంతా తిప్పిన జ‌నం

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఓ పురుషుడిని స్థానికులు ఘోరంగా అవ‌మానించారు. వారి మెడ‌లో చెప్పుల దండ వేసి, ఊరంతా ఊరేగించారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మ‌హారాజ్‌గంజ్ మ‌హ‌మూద్‌పూర్‌లో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. గ్రామ‌స్తులు ఇలా వారిపై దాడి చేయ‌డానికి ఒకే ఒక్క కార‌ణం.. ఈ ముగ్గురూ మ‌ద్యాన్ని అమ్ముతున్నారంటూ ఆరోప‌ణ‌లు రావ‌డ‌మే.

తాము మ‌ద్యాన్ని అమ్మ‌ట్లేద‌ని బాధితులు మొత్త‌కుని చెబుతున్న‌ప్ప‌టికీ.. గ్రామ‌స్తులు వినిపించుకోలేదు. వారిపై దాడికి పాల్ప‌డ్డారు. చెప్పుల‌దండ‌ను మెడ‌లో వేసి, కొట్టుకుంటూ ఊరంతా తిప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు మ‌హ‌మూద్‌పూర్ గ్రామానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌నకు కార‌ణ‌మైన వారిపై కేసు న‌మోదు చేశారు. ముగ్గుర్నీ బంధ విముక్తుల‌ను చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here