ఇంటి పైక‌ప్పుపై తండ్రి..చేతిలో రెండేళ్ల పాప‌.. అత‌ని వెనుక పోలీసు! ఊహించ‌ని ట్విస్ట్‌!

కేప్‌టౌన్‌: ద‌క్షిణాఫ్రికాలోఓ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చివ‌రి నిమిషంలో పోలీసులు జోక్యం చేసుకోవ‌డంతో ఓ చిన్నారి ప్రాణం నిలిచింది. అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేయ‌డానికి స్థానిక అధికారులు వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ఇంటిని కూల్చొద్దంటూ మిద్దెపైకి ఎక్కిన ఆ ఇంటి య‌జ‌మాని కన్నబిడ్డ ప్రాణాలను సైతం లెక్క చేయ‌లేదు.

 

పోర్ట్‌ ఎలిజబెత్ శివార్ల‌లో విచ్చ‌ల‌విడిగా అక్ర‌మ క‌ట్ట‌డాలు వెలిశాయి. వాటిని కూల్చివేయ‌డానికి అధికారులు మందీ, మార్బ‌లంతో వ‌చ్చారు. పోలీసులు, అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, స్థానిక మున్సిప‌ల్ అధికారులు ఇళ్ల‌ను కూల్చివేయ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే యంత్రాల‌తో చేరుకున్నారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఇళ్ల‌ను కూల్చొద్దంటూ బైఠాయించారు.

 

వారిలో ఓ వ్య‌క్తి త‌న కుమార్తెను ఎత్తుకుని, ఇంటిపైకి ఎక్కాడు. అక్క‌డే బైఠాయించాడు. త‌న ఇంటిని కూల్చొద్దంటూ పోలీసులు, అధికారుల‌తో వాగ్వివాదానికి దిగాడు. ఇంటిని ముట్టుకుంటే త‌న బిడ్డ‌ను దూరంగా విసిరేస్తాన‌ని హెచ్చ‌రించాడు. దీనితో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

అతనికి తెలియ‌కుండా ఓ పోలీసు కానిస్టేబుల్ ఇంటి వెనుక వైపు నుంచి మిద్దెపైకి చేరుకున్నాడు. ఆ వ్య‌క్తి కంట్లో ప‌డ‌కుండా, ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. క్ష‌ణాల్లో కానిస్టేబుల్‌ను గుర్తించిన ఆ వ్య‌క్తి చేతిలో ఉన్న త‌న కుమార్తెను అమాంతం గాల్లో విసిరేశాడు.

ఊహించ‌ని ఈ చ‌ర్య‌తో అధికారులు నిరత్త‌రుల‌య్యారు. వెంట‌నే- పాపను ప‌ట్టుకోవ‌డానికి ప‌రుగెత్తారు. చివ‌రి నిమిషంలో పాప‌ను సుర‌క్షితంగా, నేల‌పై ప‌డ‌కుండా ప‌ట్టుకోగ‌లిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైరల్‌గా మారింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమ కట్టడాలను నేల‌మ‌ట్టం చేశారు.

Joe Slovo – Nelson Mandela Bay | Police demolish homes

WATCH – A father and his child stand on the roof of his house in Joe Slovo informal settlement in Nelson Mandela Bay in an attempt to prevent police from demolishing it. There is a heavy police presence in the area where SAPS and metro police as well as members of the municipality are demolishing shacks built on municipal land.

HeraldLIVE – Port Elizabethさんの投稿 2018年4月12日(木)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here