బ్యూటీ పార్ల‌ర్‌లో త‌ల్లీకుమార్తెలిద్ద‌ర్నీ క‌లిపి చిత‌గ్గొట్టారు..! చావు బ‌తుకుల్లో కూతురు!

బ్యూటీపార్ల‌ర్‌ను నిర్వ‌హిస్తోన్న ఓ మ‌హిళ‌, ఆమె కుమార్తెపై దాడి చేశారు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని విభూదిఖండ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చోరీ కేసు నేప‌థ్యంలో ఈ దాడి చోటు చేసుకుని ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. బాధితుల పేర్లను పోలీసులు వెల్ల‌డించ‌ట్లేదు.

బాధిత మ‌హిళ విభూదిఖండ్ ప్రాంతంలో కొన్నాళ్లుగా బ్యూటీ పార్ల‌ర్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆమెకు భ‌ర్త‌, కుమార్తె ఉన్నారు. సోమ‌వారం రాత్రి తన కుమార్తెతో క‌లిసి బ్యూటీ పార్ల‌ర్‌ను ఉన్న స‌మ‌యంలో ఆరుమంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆ పార్ల‌ర్‌పై దాడి చేశారు. బ్యూటీపార్ల‌ర్‌లోనికి వెళ్లి, ఎవ‌రూ రాకుండా లోప‌లి వైపు నుంచి గ‌డియ పెట్టారు. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కుమార్తెను ఇష్టానుసారంగా చిత‌గ్గొట్టారు.

ఈ ఘ‌ట‌న‌లో వారిద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. స్పృహ త‌ప్పిన స్థితిలో వదిలేసి వెళ్లిపోయారు. దీన్ని చూసిన స్థానికులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

త‌మ‌పై ముగ్గురు వ్య‌క్తులు అకార‌ణంగా చోరీ కేసును బ‌నాయించార‌ని బాధితురాలు చెబుతున్నారు. దాని నేప‌థ్యంలోనే ఈ దాడి జ‌రిగి ఉంటుంద‌ని పోలీసుల‌కు వివ‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here