వ‌జ్రాల వ్యాపారులే ఆమె టార్గెట్‌!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న యువ‌తి పేరు అస్మిత గోహిల్‌. వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. వ‌జ్రాల న‌గ‌రంగా పేరున్న సూర‌త్ ఆమె అడ్డా. అడ్డా అనే ప‌దం ఎందుకు వాడాల్సి వ‌చ్చిందంటే.. ఆమె ఓ లేడీ డాన్ కాబ‌ట్టి. ఈ వ‌య‌స్సులోనే ఓ సారి జైలుకు కూడా వెళ్లొచ్చిన అస్మిత‌.. అక్ర‌మ వ‌సూళ్లు చేయ‌డం దిట్ట‌.

 

త‌న ప్రియుడిని వెంటేసుకుని బైక్‌పై తిరుగుతూ ఓ ఛోటా సైజు గ్యాంగ్‌ను న‌డిపిస్తోందామె. సూర‌త్‌లో అక్ర‌మంగా వజ్రాల వ్యాపారాల‌ను నిర్వ‌హించే వారిని టార్గెట్‌గా చేసుకుంటుందామె. వారి అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించి, డ‌బ్బులు గుంజుతుంటుంది.

ఈ నెల 19వ తేదీన జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చిన అస్మిత‌.. అదే రోజు రాత్రి త‌న ప్రియుడి బైక్‌పై తిరుగుతూ, హ‌ల్‌చ‌ల్ చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. సూర‌త్‌లోని వార్ఛా ప్రాంతంలో తీసిన‌ట్టుగా చెబుతోన్న ఓ వీడియోలో.. అస్మిత త‌న బోయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన దృశ్యాలు రికార్డ‌య్యాయి.

క‌త్తి చేత ప‌ట్టుకుని వార్ఛాలోని భ‌గీర‌థ సొసైటీలో దౌర్జ‌న్యం చేస్తోన్న దృశ్యాల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజ‌రాత్ సోమ్‌నాథ్ జిల్లాలోని గాంగ్డా గ్రామానికి చెందిన అస్మిత మూడేళ్ల కింద‌ట సూర‌త్‌కు వ‌చ్చింది. తొలుత‌- వ‌జ్రాల త‌యారీ సంస్థ‌ల్లో ఉద్యోగిగా చేరింది. ఆ త‌రువాత ఆయా సంస్థ‌లు చేసే అక్ర‌మ వ్యాపారాలకు సంబంధించిన గుట్టుమ‌ట్ల‌ను తెలుసుకుంది. అదే స‌మ‌యంలో ఆమెకు సంజ‌య్ భువ అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

అత‌నితో క‌లిసి బ్లాక్‌మార్కెట్‌ నిర్వ‌హించే వ‌జ్రాల వ్యాపారుల‌ను టార్గెట్‌గా చేసుకుని ల‌క్షల రూపాయ‌ల‌ను ఆర్జించింది. వార్ఛాలో జ‌రిగిన ఓ ట్రిపుల్ మార్డ‌ర్ కేసులో కూడా ఆమెకు ప్రమేయం ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కేసులోనే ఆమె జైలుకు వెళ్లొచ్చింద‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here